రైలు నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుదవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిర్నపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు కదులుతున్న రైలు నుంచి కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు.
మృతి చెందిన వ్యక్తి సుమారు 35 సంవత్సరాల ఉంటుందని తెలిపారు.మృతుని వివరాలకు పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658591 కు చెప్పగలరని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.
