హైదారాబాద్ లో యస్ ఆర్ నగర్ లో బుధవారం డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా ను పట్టుకున్నామని ఏసీపీ వెంకట రమణ తెలిపారు. ఈ మేరకు ఆయన సీఐ శ్రీనాథ్ రెడ్డి తో కలసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఎల్.మాథ్యూ సంజయ్ తన బాల్యాన్ని బెంగళూరులో గడిపాడని ఆ తర్వాత అతని కుటుంబం హైదరాబాద్‌కువచ్చి స్థిరపడ్డారన్నారు అతను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడని బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ సరఫరాదారు అయిన తన చిన్ననాటి స్నేహితుడు అసదుల్లాతో తిరిగి కనెక్ట్ అయ్యాడు.
హైదరాబాదులో చాలా మంది డ్రగ్స్ తీసుకునే అలవాటు కలిగి ఉన్నారని, వారికి ఎక్కువ ధరలకు డ్రగ్స్ విక్రయిస్తే ఎక్కువ డబ్బు సంపాదిస్తారని గమనించాడు.
ఇదే విషయాన్ని డ్రగ్ పెడ్లర్ అయిన అసదుల్లాకు చెప్పాడు ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేయాలని కోరాడు. దానికి అతను అంగీకరించాడని గత మే- నుంచి MDMA డ్రాగ్ ను సరఫరా చేస్తున్నాడని .
నిత్యం బెంగుళూరుకు వెళ్లి అసదుల్లా నుంచి ప్రతిసారీ 20 గ్రాముల MDMAను గ్రాముకు రూ.1,500 లకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని గ్రాముకు రూ.4,500 లకు విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు.
ఇప్పటివరకు అసదుల్లా నుంచి దాదాపు 7 సార్లు ఎండీఎంఏ డ్రగ్ తీసుకొచ్చాడని ఏసిపి వివరించారు ఈ నెల 23.నిందితుడు మాత్యు మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన ముచనపల్లి రాజ్ కుమార్ కు డ్రగ్స్ అమ్ముతుండగా యస్ ఆర్ నగర్ పోలీసులు వల పన్ని పట్టుకున్నారు మ్యాథ్యు డ్రగ్స్ ను బెంగుళూర్ లో హాసాదుల్లా నుంచి కొనుగోలు చేసి ప్రైవేట్ బస్సు లో తెచ్చాడని ఏసీపీ పేర్కొన్నారు .
ఇటీవలి కాలంలో అనేక మంది యువకులు/విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడడం, నేరాలు చేయడం మరియు ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని .
ఈ విపత్తుకు అనేక కుటుంబాలు బలి అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు, తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని పోలీసులను సంప్రదించడానికి లేదా పోలీసులకు సమాచారం అందించడానికి సంకోచించకుండా ఉండాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, హైదరాబాద్ నుండి యువతకు/విద్యార్థులకు విజ్ఞప్తి.
ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి మరియు డ్రగ్ ఫ్రీ నగరానికి కృషి చేయడానికి ఫోన్ నెం.8712671111.నెంబర్ లో సంప్రదించాలన్నరు.