నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 18 సంవత్సరాలలోపు గల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ పేర్కొన్నారు.
బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లా ఆధ్యర్యంలో జూలై 26 నాడు 0- 18 సంవత్సరాలలోపు గల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులపై ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగవ అంతస్తులో 435 వ రూమ్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తీసుకురావలసిన పత్రాలు,కొత్త రేషన్ కార్డు / ఆహార భద్రత కార్డు.ఆధార్ కార్డు – పిల్లలది మరియు వారి తల్లి తండ్రులదిపిల్లలది జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) పిల్లలది / వారి తల్లి తండ్రులదిమునుపటి ఆరోగ్య రికార్డులు