గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరం లోని మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎస్ఐ సమాచారం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి వర్షానికి తడిచి అనారోగ్యం తో నగరంలోని కంటేశ్వర్ చౌరస్తా లో డివైడర్ పక్కన మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికులు గమనించి మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ప్రవీణ్ పేర్కొన్నారు..