HomePOLITICAL NEWSInternationalభారీగా పడి పోయిన బంగారం ధరలు ......24 క్యారెట్ ల గోల్డ్ రూ 1.40 లక్షలు...

భారీగా పడి పోయిన బంగారం ధరలు ……24 క్యారెట్ ల గోల్డ్ రూ 1.40 లక్షలు …….కనిపించని యుద్ధ ప్రభావం

యుద్ధం తో పశ్చిమ ఆసియా రగులుతూనే ఉన్న బంగారం ధర అనూహ్యంగా తగ్గుముఖం పడుతుంది. సోమవారం మరింత తగ్గుదల కనిపించింది 24 క్యారెట్ ల గోల్డ్ తులం రూ 1.40 లక్షలు కుదిగింది. శనివారం రూ 1.45 లక్షలుండే. అమెరికా ఇరాన్ యుద్ధం తో బంగారం ధరలు అంచనాలకు అందనంత గా పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు భావించాయి.

అందుకు తగ్గట్టుగానే జస్ట్ పది రోజుల్లోనే తులం గోల్డ్ ఏకంగా రూ 1.78 లక్షలకు చేరింది. యుద్ధం రోజు రోజు కి మరింత ముదురుతుండడం గ్యాస్ క్రూడ్ ఆయిల్ దిగుమతి క్లిష్టంగా మారింది రాబోయే రోజుల్లో బంగారం కూడా మరింత ప్రియం అయ్యే ఛాన్స్ వుందంటూ ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందాయి.

పెండ్లిలా సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేయడం అనివార్యం అయింది అందుకే ధర అమాంతంగా పెరుగుతున్న కొనుగోళ్లు మాత్రం యధావిధిగా సాగాయి. ఈ నేపథ్యంలోనే నాలుగురోజులుగా బంగారు ధర తగ్గుదల ను నమోదు చేస్తూ వస్తుంది. తులం రూ 1.75 లక్షల నుంచి రూ 1.40 లక్షలకు వచ్చింది.

యుద్ధం మరింత తీవ్ర తరం అవుతుంటే బంగారం ధరలు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు కానీ యుద్ధం తగ్గుముఖం పట్టక పోయినా సరే బంగారం మాత్రం అనూహ్యంగా తగ్గుతుండడం తో పసిడి ప్రియులు సంబర పడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments