నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 34 సంవత్సరాలుగా ఉండగా. మరో 10 సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరకాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ జీఓ జారీ చేసింది. నిరుద్యోగ యువత అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కానీ.. పెంచిన వయోపరిమితి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని, యూనిఫాం సర్వీసుల ఉద్యోగాల పెంపుకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పోలీస్, అగ్నిమాపక, ఎక్సైజ్ కంట్రోల్, జైలు, అటవీశాఖల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 34 ఏళ్ల వయో నిబంధనే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
