నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలన అస్తవ్యస్థంగా మారింది.అక్షర క్రమంలో ముందున్న నిజామాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిలో అథమ స్థానంలో నిలుస్తున్నది.
అభివృద్ధి దేవుడెరుగు.. కానినెలలు మున్సిపల్ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న ఫైళ్ళు ముందుకు కదలడంలేదనే ఆరోపణలున్నాయి..
అలాగే ఇంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రధాన పోస్టులన్నీ ఖాళీలు ఉండడంతో పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణలోని మూడవ అతిపెద్ద కార్పొరేషన్ గా పేరు ఉన్న పాలన అటకెక్కింది. మున్సిపల్ కమిషనర్ తప్ప మిగతా ప్రధాన పోస్టులు ఖాళీ ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెలలు గడుస్తున్న పనులు మాత్రం ముందుకు సాగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మార్చి నెలలో డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ పదవి విరమణ పొందారు.
ఆ తర్వాత బోధన్ సానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న జయ కుమార్ కు పదోన్నతి పై ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు అప్పజెప్పారు.
ఈ నేపథ్యంలో గత పక్షం రోజుల క్రితం నిజామాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా రవిబాబును, అసిస్టెంట్ కమిషనర్గా నజీర్ ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన విషయం అందరికీ విధితమే.
డిప్యూటీ కమిషనర్ గా బదిలీపై వచ్చిన రవి బాబును సానిటరీ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నజీర్ కు ఇప్పటికి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఇంచార్జి డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయ కుమార్ ను ఈనెల 18 వ తేదీన హైదరాబాద్ బదిలీ చేశారు.
దీంతో ఆయన హైదరాబాద్ బదిలీపు వెళ్లారు.దీంతో నిజామాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పదవి ఖాళీ అయింది. ఇంత పెద్ద కార్పొరేషన్ లో మున్సిపల్ కమిషనర్ మినహా మిగతా ప్రధాన పోస్ట్లు అన్ని ఖాళీ ఉండడంతో ప్రజలు ఆందోళన కు గురవుతున్నారు.
ప్రధాన పోస్టులన్నీ ఖాళీ ఉండడంతో బల్దియాలో పనులు ముందుకు కదలడం లేదనే విమర్శలు వెలువెతుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ లో అతి ముఖ్యమైన రెవెన్యూ శాఖలో ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పడి ఉంటున్నాయి.
ప్రజలు ప్రతి చిన్న పని కోసం సైతం ఆరు నెలలుగా తిరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపణలు వెలుగుతున్నాయి.
నెలలు గడుస్తున్న ఇంకా ఇన్చార్జిలతో పాలన వ్యవహారాలు నడిపించడం గమనార్హం. ఈ మేరకు కింది స్థాయి సిబ్బంది అధికారులు లేరని ప్రజలను మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ ప్రదిక్షణలు చేయిస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు.
