కాలేజి యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీనితో మంగళవారం నుంచి రాష్త్రం లో ఇంజనీరింగ్ కాలేజీ లు యదావిదిగా కొనసాగనున్నాయి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
దీంతో బంద్ విరమిస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. మిగిలిన రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి కాలేజీలు ఓపెన్ కానున్నాయి.
కాగా, పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాలను నిర్వహించే పరిస్థితి లేకుండా పోతోందని గతకొన్ని రోజులుగా యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి.
ఇటీవల విద్యార్థులు సైతం రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయి పడ్డ ఫీజులను మంజూరు చేయాలని డిమాండ్ చేశా
