HomeCRIMEతాళ్ళ రాంపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత …..భారీగా పోలీసులు మోహరింపు ….

తాళ్ళ రాంపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత …..భారీగా పోలీసులు మోహరింపు ….

కల్లు అమ్మకాలు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది ప్రశాంతంగే గ్రామంకల్లోలంగా మారింది. సకాలం లో పోలీసు లు రంగంలోకి దిగడంతో పరిస్థితి చేయ దాట లేదు.

భారీగా పోలీసులు మోహరించి ఇరువర్గాల కు నచ్చజెప్తున్నరు. రాజీ ఫార్ములా ఫై పోలీసు దృష్టి పెట్టారు.ఎర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ గ్రామంలో .

సోమవారం తాళ్ళ రాంపూర్ లోని గౌడ కులస్తులకు మరియు పాత విడిసి మధ్య కల్లు వివాదం మరోసారి రగిలింది. గ్రామంలో కల్లు కు మంచి డిమాండ్ ఉంది.

కల్లు అమ్మకాలు సైతం తమ ఆదీనంలో ఉండాలని గతంలో ఉన్న విడిసి పట్టుబట్టింది అవసరం అయితే ఇతర గ్రామాల గీత కార్మికులతో కల్లు తీయిస్తామని హెచ్చరించింది. కానీ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తో పాటు మరికొంత మంది విడిసి వైఖరిని అడ్డుకున్నారు.

గ్రామానికిచెందిన గీత కార్మికులు కల్లు అమ్మాలంటే గ్రామానికి అయిదు లక్షలు ఇవ్వాలని విడిసి డిమాండ్ చేసింది ఈ క్రమం లోనే గౌడ కులస్తులను విడిసి కమిటీ సబ్యులు బహిష్కరించారు పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో స్వయంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ రంగం లోకి దిగి అదే గ్రామంలో సదస్సు నిర్వహించారు.

అసలు తమ గ్రామంలో విడిసి అనేది ఉండబోదని ఇదే వేదికగా గ్రామపెద్దలు ప్రకటించారు దీనితో వివాదం సమిసి నట్లుగానే భావించారు.

కానీ గ్రామంలో ఈత చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసారు దీనితో సోమవారం గ్రామంలో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది.

దీనితో కేసులు నమోదు అయ్యాయి.ఈ క్రమంలోనే గౌడ్ కులానికి చెందిన పలువురి ని పాత విడిసి కి చెందిన కొందరిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి గ్రామస్తులు మూకుమ్మడిగా వెంటాడడం తో వారంతా ఓ గదిలో తాళం వేసుకొని తల దాచుకున్నారు.

విషయం తెలియడంతో పోలీసులు హుటాహుటిన వెళ్లి పరిస్థితి ని అదుపులోకి తెచ్చారు ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధి లోని అధికారులందరూ గ్రామానికి వెళ్లారు.

గ్రామం లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అయితే ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం కు ముగింపు పలకడానికి రాజీ మార్గం ఉత్తంగా భావిస్తున్న పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments