నగరంలోని ఆర్.ఆర్ చౌరస్తా రియల్ ఎస్టేట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నలుగురు కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు జల్లెల రమేష్ నేతృత్వంలో నిర్వహించిన
ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ బంటు రాము, 8వ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్, 27వ డివిజన్ కార్పొరేటర్ చిరంజీవి, 6వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల శ్రావణ్ లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
నగర అభివృద్ధిలో కార్పొరేటర్ల పాత్ర కీలకమని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి పసుల నర్సింగ్ రావు, కోశాధికారి రమణ గౌడ్, కార్యవర్గ సభ్యులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
