HomeDevotionalదూపదీప నైవేద్యాలకు నోచుకోని పురాతన ఆలయంలో ప్రత్యేక పూజలు..

దూపదీప నైవేద్యాలకు నోచుకోని పురాతన ఆలయంలో ప్రత్యేక పూజలు..

ఆటోనగర్‌లో భక్తుల సమక్షంలో హనుమాన్ చాలీసా పారాయణం.నగరంలోని ఆటోనగర్ ప్రాంతంలో గల అత్యంత పురాతనమైన, మహిమగల హనుమాన్ దేవాలయం ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది.

ఒకప్పుడు భక్తులతో కళకళలాడిన ఈ క్షేత్రం, ప్రస్తుతం సరైన దూపదీప నైవేద్యాలకు నోచుకోకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, స్వామివారిపై భక్తితో పలువురు హనుమాన్ భక్తులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు.

ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఆలయంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపారు.పురాతనమైన ఈ ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలని, నిత్య పూజలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా భక్తులు కోరారు.

ఈ కార్యక్రమంలో భక్తులు లక్ష్మణ్, గంగాధర్, కార్తీక్, నితిన్, వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments