శ్రీ గురుదత్త రాష్ట్ర మహాసభ సంఘం ఉపాధ్యక్షులుగా నియమితులైన మురళిని, శ్రీ దత్త ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.
సమాజ సేవలో నిరంతరం తపించే మురళికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం తమ సంఘానికి గర్వకారణమని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిష్టించి, సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర మహాసభలో బాధ్యతను అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
అందరి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా గురుదత్తాశయాలను, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ దత్త ఆర్యవైశ్య సేవా సంఘం తనకు అందించిన ఈ సన్మానం, తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, దత్త భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మురళికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
