. ఆధునిక సాంకేతికత సాయంతో రికవరీ చేసిన సుమారు 18 మొబైల్ ఫోన్లను సోమవారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా టౌన్-I ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో ఫోన్లు పోగొట్టుకున్న వారు ‘సీఈఐఆర్’ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా, వాటిని ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఫోన్ల యజమానులను పిలిపించి, సరైన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం వారి మొబైల్‌లను అప్పగించారు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎవరైనా మొబైల్ ఫోన్లు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా ఫోన్లను త్వరితగతిన గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
