అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారి పుట్టినరోజు సందర్బంగా నగరం అంత సేవ కార్యక్రమాలతో మారు మొగిపోయింది.
బిజెపి పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో ఉండాలని నగరంలో ఆలయాలలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు,పెద్దఎత్తున నిర్వహించడం జరిగింది.
ప్రత్యేక పూజలు:శ్రీవాసవి కన్యాకాపరమేశ్వారి ఆలయం, నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మహాన్నదాన కార్యక్రమాలు : నీలకంఠేశ్వర ఆలయంలో మహా అన్నదానం, దుబ్బ అరుంధతి నగర్ లో అన్నదానం,నాగారం 80 క్వార్టర్స్ లో అన్నదానం, PLMS పెట్రోల్ బంక్ దగ్గర అన్నదానం,కొత్త గంజ్ లోని అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.
రక్తదాన శిబిరాలు : ఆర్యవైశ్య పట్టణ సంఘం, మార్వాడి గల్లీ డిఎస్ఎన్ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో దాదాపు వందమంది రక్తదానం చేసారు.ఖలీల్ వాడిలోని పలు చోట్ల మొక్కలు నాటడం జరిగింది.
వర్నీ చౌరస్తాలో మజ్జిక పంపిణి వంటి సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు తన మీద ప్రేమ అభిమానాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సేవ కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపారు తనను ఆదరించే బిజెపి నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు , కార్యకర్తలకు రుణపడి ఉంటానని తెలిపారు.
