Monday, May 4, 2026
HomeCRIMEకొనసాగుతున్న హరీష్ విచారణ

కొనసాగుతున్న హరీష్ విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 160 సీఆర్‍పీసీ కింద విచారణకు రావాలని ఆయనకు సోమవారం నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు ఆయన విచారణకు హాజరయ్యారు.

హరీశ్ రావుతో పాటు ఆయన అడ్వకేట్ రామచందర్‌రావు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో అక్కడ పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం సజ్జనార్ నేతృత్వంలోని సిట్ (SIT) అధికారుల బృందం హరీశ్‌రావును ప్రశ్నిస్తోంది.

కస్టడీలో అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్లతో పాటు ఐ న్యూస్ చానల్ ఎండీ శ్రవణ్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సిట్ అధికారులు హరీశ్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ‘. అయితే విచారణ సందర్భంగా గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీశ్‌రావు సిట్‍కు సమర్పించారు5G.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!