తనయుడు తో కలసి ఓ అపార్ట్ మెంటులోకి చోరీకి వచ్చిన ప్రబుద్దుడు. ఇంట్లో చోరీ చేయడం కుదరక ఎలాగో వచ్చాం ఖాళీ చేతులతో ఎందుకు వెళ్లడం అనుకున్నాడు. ఆ ఇంటి బయట ఉన్న చెప్పులను కవర్ లో వేసుకొని వెళ్ళాడు.
ఈ ఘటన సుభాష్ నగర్ లో జరిగింది. అయితే అపార్ట్ మెంట్ వాసులు స్థానిక పోలీసులకు పిర్యాదు చేస్తే ఎహే చోరీ జరగలేదు కదా చెప్పులే కదా పోయింది అంటూ వెటకారంగా మాట్లాడారని సమాచారం.సుభాష్ నగర్ లోని వెంకీ అపార్ట్ మెంట్ లో గుర్తు తెలియని వ్యక్తి తన ఆరేళ్ళ కొడుకు తో కలసి చొరబడ్డాడు.
రెండో ఫ్లోర్ లో తాళం వేసి ఉన్న ఫ్లాట్ లో చోరీ యత్నించారు.కానీ సాధ్యం కాక పోవడంతో చివరికి ఏమి చేయాలో తోచక సదరు దొంగ ఇంటి బయటఉన్న చెప్పులు ఓ కవర్ లో వేసుకొని వెళ్ళాడు.అయితే ఆ ఫ్లోర్ లో సీసీ కెమెరా లను చూస్తున్న క్రమంలోనే ఈ చోరీ ఉదంతం వెలుగు చూసింది.
తండ్రి తనయులు కలిసి చోరీ కి వచ్చిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తండ్రి చెప్పులు సర్దుతుంటే తనయుడు ఎవరైన వస్తున్నారా అని చూస్తున్నట్లు రికార్డ్ అయింది. అపార్ట్ మెంట్ వాసులు వెంటనే మూడో టౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు.
కానీ చోరీ జరగలేదు కదా పోయింది చెప్పులే కదా అని లైట్ గా తీసుకున్నారు.కానీ చోరీ కి యత్నించిన వారిని గుర్తించాలని బాధితులు పట్టుబడుతున్నారు.