HomeTelanganaNizamabadవచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయబోతోందని మాజీ మేయర్ డి సంజయ్...

వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయబోతోందని మాజీ మేయర్ డి సంజయ్ అన్నారు

వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయబోతోందని మాజీ మేయర్ డి సంజయ్ అన్నారు ఆయన బుధవారం నిజాంబాద్ నగరంలోని ప్రగతి నగర్ లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపం కాన్ఫరెన్స్ హాల్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్నారని ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని ఆయన్ని గెలిపిస్తే జిల్లా ప్రజల పక్షనా ఢిల్లీ లో గొంతెత్తుతారని సంజయ్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో ఏర్పడే ఇండియా కూటమి సర్కార్ లో మంత్రి అవతారన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాటఇచ్చారని ఆయన గుర్తు చేసారు.

జిల్లాకు ఇప్పటిదాకా కేంద్ర మంత్రి పదవి దక్కలేదన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ జీవన్ రెడ్డి కే ఉంటుందన్నారు.


గత పది సంవత్సరాల నుండి రాక్షస పాలన సాగించిన టిఆర్ఎస్ పార్టీని బొందపెట్టి ప్రజలు ఈ ఎన్నికలో బీజేపీ కి గుణపాఠం చెప్తారన్నారు

గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని గత పది సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ సాధించలేకపోయిందన్నారు

బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఒకరికి ఒకరికి గొడవ పెట్టి లబ్ధి పొందుతున్నారు.

శ్రీరాముని ప్రతి ఒక్కరు వారి ఇష్ట దైవంగా కొలుచుకుంట ప్రతిరోజు వారి పూజ మందిరంలో పూజ చేస్తూ ఉంటారు కానీ ఇవ్వాళ ఎక్కడ పడితే అక్కడ పెయింటింగ్ వేసుకుంటూ ఓట్లు అడుగుతున్నారు.

దేవుని గది ఉండాల్సిన రాముడు ను రోడ్డున పడేశారన్నారు దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడం నైతికం కానే కాదన్నారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలే అప్పుడే షుగర్ ఫ్యాక్టరీ గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సన్నహాలు మొదలుపెట్టిందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బీజేపీ అభ్యర్థి బుకాయించి ఎంపీ గా గెలిచారన్నారు ఆయన ఎంపీ గా పసుపు రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.


నిజాంబాద్ పార్లమెంటు రైతాంగాన్ని నేను కోరుకునేది ఏమిటంటే ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నానునిజాంబాద్ లో స్పోర్ట్స్ గ్రౌండ్ చేయడానికి నా వంతు కృషి నేను కూడా చేస్తానని అన్నారు

కర్ణాటకలో కూడా మోదీ గారు పసుపు బోర్డు ప్రకటించి ఇవ్వలేదు మోడీ గారు ఎన్ని అబద్ధాలు ఆడతారో నాకన్నా ఎక్కువ ప్రజలకే తెలుసన్నారు


శివ భక్తులే గాని ప్రసిద్ధమైనటువంటి కంటేశ్వర్ శివాలయం బడా రామ్ మందిర్ భూములను గత ప్రభుత్వాలు కబ్జా చేయడానికి ప్రయత్నించిది నిజం కాదా అన్నారు ఈ గత పది సంవత్సరాల్లో బిజెపి పవర్ లో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యుడే గాని ఎవరైనా ఈ భూముల కోసం అడిగార రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు చేసిన విషయం నిజం కాదా అన్నారు

రామ మందిరం ఆస్తులే కానీ సంబంధించిన భూమిలో గాని గతి పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ వారు చేసినట్టు అక్రమాలు కబ్జాలు నిరుపేదల్ని భయపెట్టించి వారి పట్టాలను లాక్కొని భయభ్రాంతులకు గురి చేశారన్నారు

లాక్కున్నటువంటి భూమిలే గాని పట్టాలే గాని అది ఎవరికి చెందాలో నిలబడి పోరాడి వారికి దక్కేలా చేస్తాన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments