HomeCRIMEఆత్మ హత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్

ఆత్మ హత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్

కొల్చారం మండలంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ శనివారం రాత్రి ఎస్సై క్వార్ట్రర్స్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినారు.. సాయి కుమార్ రెండేళ్ల క్రితమే కొల్చారంస్టేషన్ కు బదిలీ ఫై వచ్చారు .ఆయన స్టేషన్ సమీపంలో నే ఉరివేసుకోవడం కలకలం రేపింది.

పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ ఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.నర్సాపూర్ పట్టణానికి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ కు ఉంది.

గత కొన్ని రోజులుగా సాయికుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్త సాయి కుమార్ ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తు, డబ్బులు ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు గురి చేస్తుండడంతో ఆందోళనకు గురైయ్యాడు.

గత కొన్ని రోజులుగా తన చావే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతదని అంటూ, ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఇంట్లో చెప్పాడని కుటుంబీకులు పోలీసులకు, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కి సమాచారం ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments