HomeDevotionalగణేష్‌ శోభాయాత్రకు భారీ బందోబస్తు1300 మంది పోలీసులతో పటిష్ట భద్రత.. 200 సీసీ కెమెరాలు, డ్రోన్లతో...

గణేష్‌ శోభాయాత్రకు భారీ బందోబస్తు1300 మంది పోలీసులతో పటిష్ట భద్రత.. 200 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా

గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్ల పరిధిలోని ప్రధాన నిమజ్జన మార్గాల్లో 1300 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య తెలిపారు.

శోభాయాత్ర జరిగే మార్గమంతా 200 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బందితోపాటు ఎక్సైజ్‌, అటవీశాఖ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బందిని కూడా బందోబస్తు విధుల్లో భాగస్వామ్యం చేశారు.

ప్రధాన మార్గాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.డీజేలకు అనుమతి లేదుశోభాయాత్రలో పాల్గొనే వారు శాంతియుతంగా వ్యవహరించాలని కమిషనర్‌ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఆడియో సిస్టమ్స్‌ను నిర్ణీత స్థాయిలోనే వినియోగించాలని స్పష్టం చేశారు. డీజేలకు పూర్తిగా అనుమతి లేదని పేర్కొన్నారు. శోభాయాత్ర సందర్భంగా సామాజిక మాధ్యమాలు లేదా ఇతర మార్గాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని పోలీసులు సూచించారు.

మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, గణేష్‌ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కమిషనర్‌ కోరారు.

అత్యవసర వేళ.. అత్యవసర పరిస్థితుల్లో 112కు డయల్‌ చేయాలని, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 87126-59700 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments