మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మక్తా గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో భారీ చోరి జరిగింది. గ్రామానికి చెందిన నాగభూషణం ఇంట్లో తెల్లవారుజామున ఈ చోరీ జరిగింది.
నాగభూషణం ఇంట్లో ఉన్న రెండు కోట్ల రెండు లక్షల నగదు , 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు ఇటీవలే నాగభూషణం తన భూమి అమ్మడంతో అడ్వాన్సుగా వచ్చిన రెండు కోట్ల రెండు లక్షల రూపాయల నగదును ఇంట్లో లో దాచుకున్నాడు
ఆయన వద్ద నగదు భారీగా ఉందనే విషయం తెలిసన వారే ఈ చోరీ కి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తుంది.మల్కాజిగిరి ఏసిపి చక్రపాణి సంఘటన స్థలాన్నీ పరిశీలించారు
