HomeTelanganaNizamabadనిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలి...అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ....

నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలి…అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ….

నిజామాబాద్‌ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

రాష్ట్ర ప్రభుత్యం హైదరాబాద్ లో చెరువులు, నాళాలు పరిరక్షణకు హైడ్రా నీ ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ లో కూడా హైడ్రా మాదిరి తీసుకొస్తే మేము స్వాగతిస్తమని పేర్కొన్నారు.

నిజాం నవాబు నిరంకుశ పాలనలో వారికి అనుగుణంగా జిల్లాల పేర్లను మార్చుకున్నారని ధ్వజమెత్తారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా, ఆదిలాబాద్ ను ఎదులపురంగా, వరంగల్ జిల్లా ను ఓరుగల్లు గా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.

అలాగే గత రెండు రోజుల క్రితం మహిళ యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ పేరు,అలాగే హండుల్మ్ కు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం బిజెపి స్వాగతిస్తుందని తెలిపారు.

అదే విధంగా తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడనీ గుర్తు చేసుకున్నారు.

అందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ గా మార్చాలని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం ను ప్రజలు కోరుకుంటున్నారని, కానీ ప్రభుత్యం మాత్రం ప్రజా పాలన దినం గా జరిపి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్యం చేసిందని విమర్శించాడు.

ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు,420 హామీలు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో న్యాలం రాజు,నగోళ్ళ లక్ష్మీ నారాయణ,సాయి వర్ధన్,మాస్టర్ శంకర్,బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments