ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్రం హోం మంత్రి అమిత్ షా రాక….పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసే బీజేపీ బారీ భహిరంగ సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.
శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని నిజామాబాద్ లోక్ సభ నియజకవర్గంలోనీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల నుంచీ బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరు కావాలని, సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి,కార్యకర్తలు పాల్గొన్నారు.