నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ 100 ఫీట్ రోడ్ లో శనివారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ పనిచేసే మధుసూదన్ కొత్త కార్ బుక్ చేద్దామని షోరూమ్ కి కుటుంబ సభ్యులను తీసుకోని వెళ్ళాడు.
సుమారు అర గంట లోనే తిరిగి వచ్చేసాడు. కానీ ఈలోపే గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా ధ్వంసం చేసి వస్తువులు చిందర వందరగా పడేసారు.
బీరువాలో నుంచి 8 తులాలు బంగారం కిలో వెండి కొంత నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు



