HomeEditorial Specialస్థానిక సమరం చిగురించిన ఆశలు …….ఎన్నికల నిర్వహణ కు ప్రభుత్వం సన్నాహాలు …..అధికారుల్లో హడావుడి ……

స్థానిక సమరం చిగురించిన ఆశలు …….ఎన్నికల నిర్వహణ కు ప్రభుత్వం సన్నాహాలు …..అధికారుల్లో హడావుడి ……

దాదాపు యేడాది కాలంగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల కు ప్రభుత్వం ఎట్టకేలకు సమాయత్తం అవుతుంది.దీనితో స్థానిక నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి.

వచ్చే నెలఖారు లోగ ఎన్నికల పక్రియ పూర్తీ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇదే కార్యాచరణ తో సన్నహాలు మొదలు పెట్టింది. అధికారుల్లో మరోసారి ఎన్నికల హడావుడి మొదలయ్యింది.

స్థానిక ఎన్నికల నిర్వహణ కు సిద్ధం అయినా నేపథ్యలోనే ప్రభుత్వం భారీఎత్తున ఐఏయస్ లను ముఖ్యంగా కలెక్టర్ లను బదిలీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మొదట సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధం అయింది.

గ్రామపంచాయితీ లకు ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ లు నిలిచి పోయే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి ఆసక్తి చూపింది. సర్పంచ్ తో పాటు యంపిటిసి జడ్పిటిసి మున్సిపల్ ఎన్నికలను వరుసగా నిర్వహించడానికి సర్కార్ మొగ్గుచూపింది.

ఈ ఎన్నికలు వేరువేరుగా జరిపితే అధికారులు సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల నిర్వహణ విదుల్లోనే కాలం వెల్లదీస్తారు. దీని పాలనా వ్యవస్థ స్తంభించి పోయే అవకాశం వుంటుందనేది ప్రభుత్వ భావన.

అందుకే ఆలస్యం అయినా సరే అన్ని ఎన్నికలు ఒకే దఫా లోనే జరపాలనేది ప్రభుత్వ ఆలోచన.
దీనితో సర్పంచ్ ఎన్నికలు మరుగున పడ్డాయి. మరో వైపు యంపిటీసీ జెడ్పిటిసి మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఎంత మేరకు అమలు చేయాలనే విషయంలో అధికార పార్టీ నేతల్లో రగడ తలెత్తింది కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీ రిజర్వేషన్ అమలోకి వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీలోని బిసి నేతలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసారు.

ఈ నేపథ్యంలోనే జనగణన ను ఆఘమేఘాల మీద పూర్తీ చేసి బిసి రిజర్వేషన్ బిల్లు ను తెరమీదికి తెచ్చి క్యాబినెట్ అసెంబ్లీ ల్లో తీర్మానాలు చేసి తుది ముద్ర కోసం కేంద్రం కు పంపారు.అక్కడ ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు.

దీనితో లోకల్ బాడీ ఎన్నికల ఫైఅంతా ఆశలు వదులుకున్నారు. అప్పటిదాకా ఎన్నికల నిర్వహణ కోసం ఉరుకులు పరుగులు గా ఏర్పాట్లు చేసిన అధికారులు ఒక్కసారిగా డీలా పడ్డారు.

ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ఒక్క రిజర్వేషన్ పక్రియ ఒక్కటే మిగిలి ఉంది. రిజర్వేషన్ రగడ తో అసలు లోకల్ బాడీ ఎన్నికలే ఇప్పట్లో జరిగేలా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లోనే అసంతృప్తి పెల్లు బికింది.

నామినేటెడ్ పదవులు ఒకరిద్దరికి పదవులు దక్కిన క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నేతలకు అందలం దక్కక అల్లాడిపోయారు. ఎన్నికలు జరిగితే వార్డు మెంబర్ సర్పంచ్ యంపిటీసీ జెడ్పిటిసి కౌన్సిలర్ కార్పొరేటర్ లాంటి పదవులతో వేలాది మంది కి పదవులు దక్కే అవకాశం ఉంది.

అందుకే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ను అనివార్యంగా భావిస్తుంది. రిజర్వేషన్ అమలు ల్లో ప్రతిబంధకాలను అధిగమించి ఎన్నికలు జరిపి కిందిస్థాయిలో కార్యకర్తలకు ఉన్నపలంగా పదవులు దక్కేలా చేయాలనేది అధికార పార్టీ ఆలోచనగా ఉంది. అందుకే ఎన్నికల నగారా మోగించబోతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments