సార్వత్రిక ఎన్నికల నామినేషన్ లఘట్టం గురువారం తో మొదలయ్యింది. బలమైన ముహూర్తం లో నామినేషన్లు దాఖలు చేయడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాల్లో నిమగ్నం అయ్యాయి. అనుకూల ప్రతికూల అంశాలను పరిగణలోకి తీసుకోని పావులు కదుపు తున్నాయి.
ఈ ఎన్నికల్లో పార్టీ ని విజయ తీరాలకు చేర్చే దిగ్గజ నేతల మీద ఆశలు పెట్టుకున్నాయి. గెలుపు ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగానే భావిస్తున్నాయి. అందుకే గెలుపు కోసం పదునైన వ్యూహాలు ….సర్వ శక్తులు ఒడ్డె నేర్పు ఉన్న నేతలకే బాధ్యతలు ఇచ్చారు.
ప్రతికూల పరిస్థితులను అలవోక అధిగమించి విజయం దక్కేలా చేసే ట్రబుల్ షూటర్ లనే ఆయా పార్టీలు రంగంలోకి దించాయి. అభ్యర్థులు రోజు వారి ప్రచారం ఇతర వ్యవహారాల్లోనే క్షణం తీరికలేకుండా వుంటారు. కానీ ఎన్నికల్లో నెగ్గాలంటే ప్రచారం ఒక్కటే పనిచేయదు. అనేక ఎత్తుగడలు …తెరచాటు వ్యవహారాలు …బేరసారాలుంటాయి. సమయానుకూలంగా అడుగులేసేది ఇలాంటి ట్రబుల్ షూటర్లే.
అభ్యర్థులను వెనుకుండి నడిపిదే వీరు. ప్రచారం పక్రియ మొదలయ్యాకే ట్రబుల్ షూటర్ లు పూర్తీ స్థాయిలో రంగంలోకి దిగే అవకాశం ఉంది.ఈసారి ఎలాగైనా నిజామాబాద్ స్తానం గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంచార్జి నియామకం అయ్యారు. రేవంత్ క్యాబినెట్ లో బెర్త్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన కు ఈ ఎన్నిక అగ్ని పరిక్షగా మారింది. మొదటి దఫాలో నే ఆయనమంత్రి అవుతారని భావించినా నిరాశే ఎదురయ్యింది.
కానీ మంత్రి వర్గ విస్తరణలో మాత్రం మంత్రి పోస్టు ఖాయం అయింది. లోకసభ ఎన్నికలు అయ్యాక మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుంది. అందుకే లోకసభ కాంగ్రెస్ గెలవడం సుదర్శన్ రెడ్డి కే అనివార్యంగా మారింది. అందుకే మొదట అంటీముట్ట నట్లుగా ఉన్న ఆయన ఇప్పుడు సీరియస్ గా పని చేస్తున్నారు. మరో వైపు బీజేపీ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ఈసారి అన్నీ తానై పనిచేస్తున్నారు. గత ఎన్నికలో ఆయన తండ్రి డి శ్రీనివాస్ తెరవెనుక మార్గనిర్దేశకం చేసారు. బీజేపీ ప్రాబల్యం నామ మాత్రంగానే ఉన్న బలమైన బిఆర్ యస్ అభ్యర్థి కవిత ను ఓడించారు.
కానీ డి యస్ అనారోగ్యం తో ఇంటికే పరిమితం అయ్యారు. అందుకే అర్వింద్ ఈసారి అన్నీ తానై పని చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ లో అనుభవం ఉన్న ఒకరిద్దరు వ్యూహకర్తల సలహాలు తీసుకుంటున్నారని సమాచారం. పార్టీ పక్షాన అజయ్ భట్ ను ఇంచార్జి గా నియమించారు. కానీ ఆయన సంస్థాగత పనులకే పరిమితం అయ్యారు.గతంలో ఏ నియోజకవర్గంలోనూ బలైమన నేతలు బీజేపీ లో లేకుండే కానీ ఈసారి అర్బన్ ఆర్మూర్ లో ఎమ్మెల్యే లున్నారు. బాల్కొండ నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ లలో గట్టి యువ నాయకత్వం అందుబాటులో ఉంది.
అందులోనూ ప్రత్యర్థుల కన్న ముందే సన్నాహక సమావేశాలు పెట్టి బూత్ స్థాయి క్యాడర్ ను సమాయత్తం చేసారు. అందుకే ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే అనే ధీమాతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తో డీలా పడ్డ బిఆర్ యస్ లోకసభ ఎన్నికల్లో గెలిచి క్యాడర్ చేజార కుండా చూసుకోవాలలే ఆలోచనలో ఉంది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కే బాధ్యతలు అప్పగించింది.
పార్టీ కష్ట కాలం లో ఉన్న నేపథ్యంలో ఆయనొక్కడే క్రియాశీలకంగా పనిచేసే అవకాశం ఉంది. జగిత్యాల్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యే లతోనూ సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆయన్ని రంగంలోకి దించారు. కానీ మాజీ ఎమ్మెల్యే లు ఏ మేరకు సహకరిస్తారో ననేది పార్టీ వర్గాల్లో ఆసక్తి గా మారింది