సార్వత్రిక ఎన్నికల సమరంలో తుది ఘట్టానికి తెరలేసింది.లోకసభ ఎన్నికల నామినేషన్ల పక్రియ గురువారం నుంచి మొదలు కాబోతుంది.ఈనెల 25 వరకు నామినేషన్ లు వేయచ్చు . మే 13 పోలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
నామినేషన్లు వేయడానికి ఎనిమిది రోజుల గడువు ఉంది. నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం లో పోటీ చేసే అభ్యర్థులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే నామినేషన్లు వేయాలి. ఎలాగో బీజేపీ కాంగ్రెస్ బిఆర్ యస్ పార్టీలు ఈపాటికే అభ్యర్థులను ప్రకటించాయి.
బీజేపీ అభ్యర్థి గా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి బిఆర్ యస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ లు ఖరారు అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పైచేయి కోసం నామినేషన్ ర్యాలీ లనే భారీగా చేస్తారు. బలమైన ముహూర్తం చూసుకొని ఎలాంటి హంగామా లేకుండా నామినేషన్ లు వేసే అభ్యర్థులు తర్వాత బలప్రదర్శన కోసం ర్యాలీ పెద్దఎత్తున నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది. ఈనెల 18,19, 21 ,23 ,24 రోజుల్లోనే ముహూర్త బలంగా మంచిగా వుందని పండితులు చెప్తున్నారు.
ఆ రోజుల్లో వందలాది పెండ్లిలు కూడా ఉన్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో నామినేషన్లు వేయడం కుదరదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ లు వేయడానికి కావలిసిన ధృవపత్రాలను సమకూర్చుకుంటున్నారు.
న్యాయ నిపుణులు ఈ పని అప్పగించారు. ప్రధాన పార్టీ లకు చెందిన ముగ్గుర అభ్యర్థులు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన వారే కావడంతో నామినేషన్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈపాటికే చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి కనీసం రెండేసి సెట్ ల నామినేషన్ లు వేసే అవకాశం ఉంది.
