ధాన్యంవద్ద కాపలా ఉన్న మహిళా మెడలో నుంచి చైన్ ఎత్తుకెళ్లిన ఘటన మోపాల్ మండలం కంజెర గ్రామంలో జరిగింది. . కంజర్ గ్రామానికి చెందిన అరికేల లక్ష్మి గ్రామ శివారు లో రోడ్డు మీద వడ్లు ఆరబోసింది.
మధ్యాహ్నం సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్ధరు యువకులు నిజామాబాద్ ఎలా వెళ్ళాలి అంటూ ఆమెను మాటల్లో దింపి మెడలోని తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు .షాక్ నుంచి తేరుకొని బాధితురాలు కేకలు వేస్తూ పరిగెత్తినప్పటికీ వారు పరారీ అయ్యారు.