ఇందూర్ నగరం :బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మాట్లాడుతు ఆనాడు తెలంగాణ బలిదేవత సోనియామ్మ అని చెప్పిన రేవంత్ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లా అయ్యిందని
వందల మందిని బలి తీసుకున్న బలి దేవతను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవనికి ఎట్లా ఆహ్వానిస్తున్నారో రేవంత్ సమాధానం చెప్పాలని,ఆనాడు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తుంటే ఆ కన్న తల్లితండ్రుల కడుపుకోత చూడలేక దివంగత కేంద్ర మంత్రివర్యులు మనం తెలంగాణ చిన్నమ్మ గా పిలుచుకునే సుష్మస్వరాజ్ గారు పార్లమెంట్ లో గోంతేతి తెలంగాణ బిడ్డలు పడుతున్న గోసను పార్లమెంట్ లో వినిపించి ఇంకొకరు కూడ తెలంగాణ కోసం బలి కావొద్దు అని,
ప్రతేక తెలంగాణ రాష్ట్రానికి బిజెపి పూర్తి మద్దతు పలకడం జరిగిందని,ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉద్యమన్ని అణచివేయాలని చూసిర్రు అని ఆంధ్ర నాయకులకు అమ్ముడుపోయి తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతుంటే పదవే ముఖ్యం అని గోడమీద పిల్లిలా వ్యవహరించిన ఘనత కాంగ్రెస్ నాయకులదని,తెలంగాణ సాధించడంలో, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు చేసింది శున్యం అన్నారు,
తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ 10 ఏళ్ళు దోచుకుంటే ఇప్పుడు మన రేటేంతన్న ఆరు గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఇంకా అప్పుల కుప్పచేసి ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మే పనిలో ఉన్నాడని, తెలంగాణ సోమ్మంతా ఢిల్లీకి దొచిపెడుతున్నాడని మండిపడ్డారు,అదే విదంగా నగరంలో ఉన్న సమస్యలు నిరూపయోగంగా ఉన్న ఇంటిగ్రెటెడ్ మార్కెట్, పాత కలెక్టర్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం,
నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు, తదితర అంశాల పైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గారికి పిర్యాదు చేయడం జరిగిందని ఎన్నికల కోడ్ అనంతరం వాటిని పరిష్కరించడానికి సహకరిస్తానని అన్నారని తెలిపారు.
ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపీ కార్పొరేటర్స్ మల్లేష్ యాదవ్, సుంకరి నారాయణ, మాస్టర్ శంకర్, ముత్యాలు, ఎర్రం సుధీర్ , బీజేపీ నాయకులు గడ్డం రాజు,ఇల్లందుల ప్రభాకర్, ఇప్పకయల కిషోర్,బైకన్ మధు, పంచరెడ్డి శ్రీధర్, బద్దం కిషన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు