Monday, December 8, 2025
HomeTelanganaNizamabadఘనంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు..దుస్తుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు

ఘనంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు..దుస్తుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, రాంభూపాల్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా కమిటీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కమిటీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

నాగారం లో అక్కడి ఓ మైనారిటీ నాయకుని ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. అలాగే ముబారక్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అనుచరుడు లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రాం భూపాల్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి అభ్యున్నతికి కోసం పాటు పడుతున్న గోప్ప నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. అలాగే పార్టీ అభివృద్ధి కోసం,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం అయన ఎంతగానో కృషి చేశారని అన్నారు.

అనంతరం పెద్దమ్మ ఆలయం లో అన్నదానం నిర్వహించిన లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ అయన చేసే ప్రతీ పనిలో తోడు ఉంటూ వస్తున్నానని చెప్పారు. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మహేష్ కుమార్ గౌడ్ పై ఆయన కుటుంబం పై ఎల్లప్పుడూ ఉండాలనీ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విపుల్ గౌడ్, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వేణు, ముబారాక్ నగర్ మాజీ సర్పంచ్ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!