నిజామాబాద్ నగరంలోని వెంగళరావు నగర్ సమీపంలో ఉన్న బాబన్ షాబ్ చెరువు లో సోమవారం సాయంత్రం రెండు మృత దేహాలు లభ్యం అయ్యాయి. భార్యాభర్తల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమృతపుర్ గ్రామానికి చెందిన పెద్ద బాబయ్య పోశమ్మ లుగా గుర్తించారు వీరు స్థానికంగా దర్గా వద్దే ఉంటూ బిక్షాటన చేస్తూ జీవనముసాగిస్తున్నారు . మృతుడికి ఇద్దరు కొడుకు లున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు చెరులో పడి ఆత్మ హత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు.