ఇద్దరు పిల్లలను కాల్వలో పడేసి వారి చావు కు కారణం అయిన తల్లి కి అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తు జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి కుంచాల సునీత సోమవారం తీర్పు చెప్పారు. నందిపేట్ మండలం కు చెందిన పల్లపు అమృత .2022 ఫిబ్రవరి 28 న భర్త శ్రీనివాస్ తో గొడవ పడింది. అనంతరం కూతరు మనుప్రియ (2 )ఆరు మాసాల కొడుకు మునుతేజ లను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లి పోయింది.
ఉదయం 11 గంటల ప్రాంతంలో చిరాజ్ పల్లి వద్ద గుత్ప మెయిన్ కెనాల్ లో పిల్లను తోసేసి తానూ దూకేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ రాకేష్ గమనించి కాల్వలో దూకి మొదట అమృత ను ఒడ్డుకు చేర్చాడు. కానీ ఆమె కొడుకు కూతురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ తర్వాత మృహాదేహాలు దొరికాయి. నందిపేట్ పోలీసులు అమృత మీద హత్య కేసు నమోదు చేసారు. జిల్లా కోర్టు లో విచారణ జరిగింది. ఇద్దరు పిల్లల చావుకు కారణం అయిన అమృత కు అయిదేళ్ల శిక్ష విధిస్తు తీర్పు ఇచ్చారు