Saturday, April 26, 2025
HomeTelanganaHyderabadనేను గుండు అయితే నిన్ను పొట్టోడు అనాలా ..ఎంపీ అర్వింద్ ఆగ్రహం

నేను గుండు అయితే నిన్ను పొట్టోడు అనాలా ..ఎంపీ అర్వింద్ ఆగ్రహం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సీఎం అనే సోయిలో లేకుండా కోరుట్ల సభలో నన్ను గుండు అంటున్నాడు. నేను అతడిని పాలమూరు పొట్టోడు అనలేనా? అని నిజమాబాద్ బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

గతంలో చెప్పినట్లుగా కేసీఆర్ అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత తన భాషను మారింది. కానీ రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే మళ్లీ పాత రోజులు తెచ్చాలా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలోనే, ఆయన మాటలోనే రియాక్ట్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో హుందాతనం మళ్లీ పోతుందని మౌనంగా ఉన్నన్నారు .

మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారంటూ కోరుట్ల సభలో గాడిద గుడ్డు ఆకారాన్ని చూపెట్టడంపై స్పందిస్తూ ఎక్కడైనా గాడిద గుడ్డు పెడుతుందా? ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా? అది గాడిద గుడ్డా లేక రాహుల్ గాంధీ గుడ్డా అంటూ సెటైర్ వేశారు..

రైతులపై రేవంత్ రెడ్డి రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నారని దుయ్యబట్టారు.ఆరు గ్యారెంటీ హామీల నుంచి ప్రజలను మళ్ళించడానికే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశం తెరమీదికి తెచ్చాడన్నారు కేవలం 6గ్యారెంటీ హామీల నుండి ప్రజలను మళ్ళించడానికి సీఎం రేవంత్ రిజ్వేషన్లపై ఇష్ట రీతిలో మాట్లాడుతున్నారని అర్వింద్ మండిపడ్డారు .

జహరాబాద్ లో జరిగిన సమావేశంలో మోడీ sc, st, OBC,ముస్లింకోసం తగ్గించే ప్రసక్తే లేదని ఆయన అన్నారన్నారు.మతప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్ తీసేస్తాం అని నరేంద్ర మోడీ అన్నారు.మొదట ews లో ముస్లిం లకు రిజర్వేషన్ కల్పించారు కానీ వాళ్ళు వినియోగించు కొలెరని ఆయన అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం రాగానే చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తాం అన్నారు.ఎన్నికల తరువాత ఒకసారి బోధన్, మరియు మెట్ పల్లి, సందర్శించారు. రేవంత్ నిజామాబాద్ లోఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సెప్టెంబర్ sep 17 న చెక్కర కర్మాగారాలు తెరిపిస్తం అని నిన్న కోరుట్ల లొ జరిగిన సమావేశంలో 17 ప్రక్రియ మొదలు చేస్తాం అని రేవంత్ మాట తప్పరు ఎద్దేవా చేసారు. పసుపు బోర్డ్ పైన గెజిట్ వచ్చాక ఇంకా ఎక్కడ అన్నా దానికి మోడీ సమాధానం ఇచ్చారు.

పసుపు బోర్డ్ కార్యాలయం ఇందుర్ గడ్డ పైననే ఉంటుందని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు, రామగుండం ఫర్టిలిజర్ ఫ్యాక్టరీ ఎవరు తెరిపించారు మోడీ కదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మత రాజీయాలు చేస్తున్నది బీజేపీ కాదు. ముస్లిం లు ఆలోచించాలని అన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పిదం తోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని అరవింద్ పేర్కొన్నారు..మోడీ ఉన్నన్ని రోజులూ ఎస్సీ ఎస్టీ రిజ్వేషన్ల తీసే ప్రసక్తే లేదు.దేశంలో స్వాతంత్య్రం వచ్చాక అత్యంత ఎజెండా తో ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థలో దేశం 5స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకుంటుందని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం కూలిపోయాక నా భాష యాస మార్చాను.

కానీ రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో వస్తున్నారని బిజెపి అభ్యర్థి అరవింద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!