లోక్ సభ ప్రచారంఉదృతం అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది రెండు రోజులపాటు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించింది .
మే 1 (ఈరోజు) రాత్రి నుంచి 48 గంటలపాటు బీఆర్ఎస్ అధినేత ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. సిరిసిల్ల లో . బస్సు యాత్రలో కెసిఆర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ 48 గంటలపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేదం విధించింది.
బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేదం అమలులో ఉంటుంది.