కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ప్రస్తుతం బీడీ కార్మిక పరిశ్రమ పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన చెందారు.
గురువారం నిజాంబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సదస్సులో ఆయన మాట్లాడారు. . మాట్లాడారు.బీడీ కార్మికులుగా దశాబ్దల కాలంగా ఉన్నవారికి ఆర్థికంగా ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు తెచ్చిందన్నారు ఇందులో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళల కొరకు ఇచ్చిన హామీలన్నీ అమల్లోకి తీసుకు వచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని ఉచిత గ్యాస్ సిలిండర్లు .
ఉచిత కరెంటు లాంటి హామీలను ఇప్పటికే అమల్లోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు లక్షలాది మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న బీడీ కార్మికులకు కాంగ్రెస్ ఎంతో అండగా ఉందన్నారు.
ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఎక్కుగా వుండే వ్యవసాయ శాఖ తర్వాత బీడీ పరిశ్రమే నన్నారు. ఉత్తర తెలంగాణ లో లక్షలాది మంది మహిళలకు బీడీ పరిశ్రమ ఉపాధి ఇచ్చేదని కానీ అదే పరిశ్రమ ఇప్పుడు సంక్షోభం ఎదురుకుంటుందన్నారు.



