Thursday, April 16, 2026
HomeLaw and Orderసెలవులో వెళ్లిన ఇంచార్జ్ ……జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీలో జాప్యం……కార్యాలయం వద్ద అభ్యర్థుల పడిగాపులు...

సెలవులో వెళ్లిన ఇంచార్జ్ ……జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీలో జాప్యం……కార్యాలయం వద్ద అభ్యర్థుల పడిగాపులు …..కొత్త ఇంచార్జ్ కోసం కసరత్తులు ?

‌..

జనన మరణ ధ్రువీకరణ పత్రాల ఇంచార్జ్ ఆకస్మికంగా సెలవులో లో వెళ్లడం తో ఆ విభాగంలో పనులు నిలిచి పోయాయి.కొత్త ఇంచార్జ్ కోసం అధికారులు రెండు రోజులుగా కసరత్తులు చేస్తున్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ లోని జనన మరణ ధృవీకరణ .పత్రాల కోసం వస్తున్న వారు అక్కడే గంటల తరబడిగా పడిగాపులు కాస్తున్నారు.జనన మరణ ధృవీకరణ కార్యాలయం పై ఇటీవలే పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. నగరపాలక పరిధిలో ప్రతి రోజు 250 -300 మందికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అధికారులు జారీ చేస్తున్నారు.

కానీ గత నెల రోజుల క్రితం నూతన అధికారి వచ్చిన నాటి నుంచి సుమారు 3000 ఫైలు పెండింగ్ లో ఉన్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రం ఏదైనా నెలరోజులగా పనులు కావడం లేదని బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు.ఈ మేరకు గత పనిచేసిన అధికారి బదిలీ కావడంతో పక్షం రోజుల క్రితం రాజేశ్వరి అనే అధికారిని బాధ్యతలు తీసుకున్నారు.

బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఆకస్మాత్తుగా సెలవు పై వెళ్ళడంతో బాధిత అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.

ఈ మేరకు కార్యాలయానికి వచ్చిన పలువురు బాధితులు అక్కకార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో సెక్షన్ అధికారులు శుక్రవారం మున్సిపల్ అధికారిని కలిసినట్లు తెలిసింది తో వెంటనే స్పందించిన ఉన్నతాధికారి వెంటనే మరో అధికారిని అటాచ్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!