. . . నగర,గ్రామీణ ప్రాంతంలో విస్తరంగా కురుస్తున్న వర్షాలు. . . లోతట్టు ప్రాంతాలను ముంచేత్తిన వర్షం నీరుదాదాపు నెల రోజుల తర్వాత జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన వర్షం శనివారం వరకు విస్తరంగా కురుస్తోంది.
ముఖ్యంగా జిల్లా,గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో మురికి కాలువ లు పొంగి ప్రవహిస్తున్నాయి. నగరంలో కురుస్తున్న ఏకధాటిగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కుండపోత వర్షాలతో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. వాహన దారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం జిల్లాల్లో ఈ పాటికే అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఒక శనివారం మాత్రమే 134.9 మి మి వర్షపాతం నమోదైనట్లు అధికారులు సూచించారు.