తనిఖీలు సరే….. చర్యలేవి?ఆచరణలో అడుగు ముందుకు సాగని వైనం.. వర్షాకాలం ముందస్తు చర్యలు శూన్యం… పూడి పోయిన వరద నీటి కలువలు…చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు….చిన్నపాటి వర్షాలకే నగరం జలమయంగా మారుతోంది. ఎక్కడిక్కడ ట్రాఫిక్కు అంతరాయమేర్పడుతుంది.
పెద్ద పెద్ద మురుగుకా లువలన్నీ అస్తవ్యస్థంగా మారుతున్నాయి. చిన్న చిన్న డ్రైనే జీల్లో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే చాలు నగర ప్రజలు, వాహ నదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోనీ పురపాలక సంఘాల్లో వర్షాకాల ప్రణాళికలను సిద్ధం చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్థోన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్షా కాలంలో ప్రజలకు వరద నీటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి.
వర్షాలు కురవక ముందే లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవ్వకుండ ప్రధాన మురుగు నీటి కాలువల్లో పూడిక తీత చేపట్టాలి. భారీ వర్షాలు కురిస్తే జిల్లాల్లోని పట్టణాల్లో పల్లపు ప్రాంతాలు ఏటా ముంపుకు గురవుతున్నాయి.
వర్షాకాలం ముందస్తు పనులు చేపట్టడాన్ని పురపాలకులు విస్మరిస్తున్నారు. గత అనుభవాలను పరిశీలనలోకి తీసుకొని వరద నీరు గృహాల్లోకి ప్రవేశించ కుండా పూర్తిస్థాయి చర్యలు మునిసిపాలిటీల్లో చేపట్టాల్సి ఉంది. ఈ దిశగా మునిసిపల్ అధికారులు స్పందించటం లేదు.
ప్రతి మునిసిపాలిటీలో ఉన్న వరద నీటి కాలువలు, ప్రధాన మురుగు కాలువల్లో వర్షా కాలానికి ముందుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. పూడిపోయిన కాలువలను పునరుద్ధరించాలి. వరద నీరు సులువుగా కాలువల్లో ప్రవహించే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రధాన మురుగు కాలువల్లో ప్రారంభం నుంచి చివరి వరకు పూడిక తీయాలి. వరద నీటి కాలువల్లో పెరిగిన నాచు తొలగించాలి.
కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కాలువలను అభివృద్ధి చేయాలి.జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను చేపట్టి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలు మురుగు కాలువల్లోకి చేరి, పూడికతీత వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయనీ కలెక్టర్ నగరపాలక సంస్థఅధికారులకు సూచనలు చేసినా, ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది.
ముఖ్యంగా మురుగుకాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్తా, చెదారం తొలగింపజేయాలని, పలు ఆరోపణులు కూడా వస్థోన్నాయి.
