కుళ్లి పోయిన మృత దేహం లభ్యం….
యనంపల్లి అటవీ అనుమానాస్పదంగా వ్యక్తి మృతి….
నిజామాబాద్ జిల్లా శివారు ప్రాంతమైన యనంపల్లీ గ్రామం పరిధి అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా పడిఉన్న కుళ్లిపోయిన మృత దేహం లభ్యం అయ్యింది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కేశపల్లి గ్రామానికి చెందిన జగదీష్(40) మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నాడు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
కుటుంబం సభ్యులా ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్ పల్లి పోలిస్ లు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.