Friday, April 18, 2025
HomeTelanganaNizamabadకాంగ్రెస్ వైపు ఆ మాజీ మంత్రి చూపు ....జిల్లాలో బిఆర్ యస్ ను మరింత బలహీనం...

కాంగ్రెస్ వైపు ఆ మాజీ మంత్రి చూపు ….జిల్లాలో బిఆర్ యస్ ను మరింత బలహీనం చేసే వ్యూహం …….చేరికల మీద కాంగ్రెస్ దృష్టి ……

జిల్లాలో బిఆర్ యస్ పార్టీ మరింత బలహీనంగా చేసే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. బిఆర్ యస్ లో పదేళ్లు కెసిఆర్ సన్నిహితుల్లో ఒకరు గా ముద్ర వేసుకొని పాలన పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం గులాబీ శ్రేణుల్లో నే జరుగుతుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎమ్మెల్యే గా గెలిచిన సదురు మాజీ మంత్రి ఇప్పడు అనూహ్యంగా కాంగ్రెస్ కీలక నేతలతో రహస్య భేటీ లు జరపడం అధికార పార్టీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

మరో వైపు మొన్నటిదాకా అధినేత కెసిఆర్ ను అంటిపెట్టుకొని తిరిగిన సదరు మాజీ మంత్రి కొద్దిరోజులుగా అంటీముట్ట నట్లుగా ఉంటున్నారని సమాచారం. ఎంపీ ఎన్నికల్లో నే తన కుటింబీకులకు టికెట్ ఇవ్వాలని అధినేత ను ఎంత అడిగినా లైట్ తీసుకున్నారట. అందుకే ఆయన అలకబూనారని గులాబీ నేతలు చెప్తున్నారు.

పైగా ఎమ్మెల్యే గా గెలిచినప్పటికి వీసమెత్తు పెత్తనం సాగక పొగ ఓడిన నేత అన్నీ తానై పెత్తనం సాగిస్తుండడం తట్టుకోలేక పోతున్నారు. పదేళ్లు నియోజకవర్గంలో తనతో పాటు కుటుంబ సభ్యులు సైతం ఇష్టారీతిన చెలరేగిపోయారు.

కనుసైరాలతో అధికారులను ఆడించారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గా గెలిచినా యంత్రాంగం అస్సలు పట్టించుకోవడం లేదు. ఇలాగే పరిస్థితి కొనసాగితే రాజకీయ భవిష్యత్ ప్రతికూలంగా మారే ప్రమాదం వుందని సదురు మాజీ మంత్రి ఆందోళన చెందుతున్నారు.

అదీగాక అసెంబ్లీ ఎన్నికల్లోనే రాజకీయ వారసుడిని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించాలని తహ తహ లాడిన అధినేత ససేమిరా అన్నారు. ఎంపీ ఎన్నికల్లోనూ అదే జరిగింది.

కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ముచ్చట ఎలాగైనా తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ సెగ్మెంట్ లో తనకున్న పట్టు సడిలిపోతే వారసుడి ఎంట్రీ తుస్సుమంటుందని బెంగ మాజీ మంత్రి లో మొదలయ్యింది.

అందుకే అధికార పెత్తనం అనివార్యంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ లో చేరితే ఎలా ఉంటుందని సన్నిహితుల తో అరా తీస్తున్నారు. ఎలాగో అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ పార్టీ చేరికల విషయంలో దూకుడు పెంచింది.

బొటాబొటీ మెజార్టీ తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ అవసరాల నేపథ్యంలో చేరికలను అనివార్యంగా భావించింది. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ యస్ లో కీలక నేతలను గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి దాక ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటున్నారు.

ఎంపీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించలేక పోయారు. వచ్చే లోకల్ బాడీ తో పాటు జెడ్పిటిసి యంపిటిసి మున్సిపల్ సహకార ఎన్నికల్లో బిఆర్ యస్ పార్టీ తుడిచిపెట్టుకపోయేలా చేయాలనీ కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది.

అందుకే బిఆర్ యస్ ఎమ్మెల్యే ఉన్న సెగ్మెంట్ లలో ఎలాగో ఇది సాధ్యం కాదనే అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే లను కాంగ్రెస్ పార్టీలో చేర్చు కునే వ్యూహం ను అమల్లోకి తేవడానికి సిద్ధం అవుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!