అయిదు వందల రూపాయలు చెల్లించే విషయంలో ఇద్దరు స్నేహితుల తలెత్తిన వివాదం తల్లీ కొడుకు హత్యకు కు గురైన కేసులో పోలీసులు పెట్టిన అభియోగాలు రుజువు కావడంతో నిందితుడి కి యావజ్జివ కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీతా కుంచాల మంగళవారం తీర్పు చెప్పారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడి పల్లి కి చెందిన శ్రీనివాస్ కు అదే గ్రామానికి చెందిన అనిల్ గౌడ్ తో కల్లు బట్టి లో పరిచయం అయ్యింది.
ఈ క్రమంలో అనిల్ అత్యవసరం వుందని శ్రీనివాస్ నుంచి అయిదు వందల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
కానీ తిరిగి ఇవ్వలేక పోయాడు. అదే విషయంలో ఇద్దరి మధ్య వైరం మొదలయ్యింది. అనేక సార్లు ఘర్షణ కూడా పడ్డారు. అనేక కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ అనిల్ వైఖరి తో కక్ష్య పెంచుకున్నాడు.
2021 నవంబర్ 7 న అనిల్ ఇంటికి వెళ్ళి గొడ్డలి తో వీరంగం చేసాడు. అనిల్ మీద విచక్షణ రహితంగా దాడి చేసాడు.
ఇద్దరి మధ్య లోకి అడ్డు వెళ్లిన రాజు బాయి. ఫై సైతం దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఓకే ఘటనలో తల్లీ కొడుకు మృతి చెందారు.
కేసు నమోదు చేసిన వేల్పూర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు శ్రీనివాస్ మీద అభియోగాలు నమోదు చేసారు.