Monday, December 8, 2025
HomeCRIMEపోలీసు అధికారిపై చేయి చేసుకున్న యువకులు....ఇద్దరు యువకులు పరారీ.

పోలీసు అధికారిపై చేయి చేసుకున్న యువకులు….ఇద్దరు యువకులు పరారీ.

పోలీసు అధికారిపై చేయి చేసుకున్న యువకులు….ఇద్దరు యువకులు పరారీ…నిజామాబాద్ కమీనరేట్ పరిధిలో యువకుల హలచల్ సృష్టించారు. డ్యూటీలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వివరాలలోకి వెళితే జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ సిబ్బంది పైన ఇద్దరు యువకులు రెచ్చిపోయారు.

ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధ రాత్రి సమయంలో ఓ హోటల్ లో ఇద్దరు యువకులు భోజనం చేశారు.

అనంతరం వారు తిన్న బోజనానికి బిళ్లు కట్టమని హోటల్ యజమాని వారిని అడ్డుకున్నారు. దాంతో వారు యజమానికి ఇప్పటి వరకూ హోటల్ తెరిచి ఉంచామన్నారు అని దాడికి తెగబడ్డారు.

ఆ యువకులే సైతం 100డయల్ చేసి ఫిర్యాధు చేశారు. దానితో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ లు ఆ యువకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

అంతటి తో వారు ఆగకుండా మెప్పించే ప్రయత్నం చేస్తున్న పోలీస్ సిబ్బంది పైన దాడి చేశారని తెలిపారు. ఆ ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వ్యక్తుల గురించి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!