HomeEditorial Specialషబ్బీర్ అడ్డా అర్బన్ లోనే ...సొంత ఇంటి కోసం బైపాస్ వెయ్యిగజాల స్థలం కొనుగోలు .......అర్బన్...

షబ్బీర్ అడ్డా అర్బన్ లోనే …సొంత ఇంటి కోసం బైపాస్ వెయ్యిగజాల స్థలం కొనుగోలు …….అర్బన్ లో మహేష్ షబ్బీర్ ల మధ్య ఆధిపత్య పోరు .

లోకసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ నగరంలోనే మకాం పెట్టేలా కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ శివారు లో సొంత ఇల్లు నిర్మించుకునేలా అత్యంత ఖరీదైన స్థలం ను కొనుగోలు చేసారు.

దాదాపు వెయ్యిగజాల స్థలం గత వారం రోజుల క్రితమే ఆయన స్థలం ఇంటి నిర్మాణం కోసం తనయుడు ఇలియాస్ పేరుమీద కొనుగోలు చేసారు.

ఇద్దరు యువనేతలే దగ్గరుండి ఈ పక్రియ ను పూర్తీ చేయించారు. లోకసభ ఎన్నికల్లో అర్బన్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆధిక్యం రావడంతో షబ్బీర్ అలీ పునరాలోచనలో పడ్డారు. ముస్లిం మైనారిటీ లు గంప గుత్తగా ఓట్లు వేయడంతో బీజేపీ ప్రాబల్యం నామ మాత్రం అవుతుందనే అంచనాలోకి షబ్బీర్ వచ్చారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

నిజానికి బిఆర్ యస్ వోటు బ్యాంకు పెద్ద మొత్తంలో గండి పడింది. లోకసభ ఎన్నికల ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లో ను పునరావృత్తం చేయొచ్చనే ధీమా కాంగ్రెస్ నేతల్లో బలంగా వచ్చింది.అందుకే షబ్బీర్ అలీ అర్బన్ రాజకీయాల్లో కొనసాగే ఆలోచనకు వచ్చారని ప్రచారం జరుగుతుంది.

ఈ మేరకు సీఎం రేవంత్ ను కలసి తన మనోగతం వ్యక్తం చేసారని సమాచారం. కానీ అర్బన్ లో పట్టు సాధించే దిశగా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పావులు కదులుతున్న నేపథ్యంలో షబ్బీర్ క్రియాశీలం కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. రాబోయే రోజుల్లో అర్బన్ అధికారపార్టీ లో ఆధిపత్య పోరు ముదిరేలా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల తరవాత షబ్బీర్ కామారెడ్డి సెగ్మెంట్ కే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన షబ్బీర్ ను ప్రభుత్వ సలహాదారుడి పదవీ తో అందలం ఎక్కారు. దీనితో ఆయన కామారెడ్డి హైదారాబాద్ లకే పరిమితం అయ్యారు .అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆయన అర్బన్ వ్యవహారాల్లో పెద్దగా పట్టించుకోలేకపోయారు.

లోకసభ ఎన్నికల పక్రియలోనూ ఆయన అర్బన్ సెగ్మెంట్ కు చుట్టపు చూపుగా వచ్చారు. దీనితో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు.పాలన పార్టీ వ్యవహారాల్లో ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. కానీ లోకసభ ఎన్నికల ఫలితాలతో అర్బన్ అధికార పార్టీలో సమీకరణాలు మారాయి.

షబ్బీర్ అలీ మరోసారి యాక్టివ్ అయ్యే పనిలో పడ్డారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అర్బన్ లోనే పట్టు సాధించే షబ్బీర్ అలీ ఎంట్రీ సిద్ధం అవుతున్నారు.

అర్బన్ ఇంచార్జ్ ఇక నుంచే తానేనని ఎమ్మెల్సీ నియామకం తర్వాత మహేష్ గౌడ్ సన్నిహితులతో చెప్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కి సైతం ఈ విషయం చెప్పానని మహేష్ అంటున్నారు.

కానీ పీసీసీ అధ్యక్ష పదవీ రాకుండా అడ్డు పడుతున్న నేతల్లో షబ్బీర్ కూడా వుండడం ఫై మహేష్ ఇప్పటికే రగిలి పోతున్నారు. దీనికి తోడు అర్బన్ సెగ్మెంట్ వ్యవహారాల్లో క్రియాశీలకం కావడం మహేష్ కు ఏ మాత్రం మింగుడు పడడం లేదు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments