విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన నిజామాబాద్ నగర శివారులోని ఖానాపూర్ గ్రామ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.నిజామాబాద్ లోని అంబేద్కర్ కాలానికి చెందిన నిమ్మ శంకర్ (68).
మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా నగర శివారులోని ఖానాపూర్ గ్రామ పరిధిలో కౌలు కు కొంత భూమిని జీవనం కొనసాగిస్తున్నారు. మృతుడు తన వ్యవసాయ భూమిలో పనులు నిమిత్తం వెళ్ళాడు.
దుక్కి కి నీరు పెట్టేందుకు తన విద్యుత్ బోర్ మోటారు ఆన్ చేసే క్రమంలో తెగిన విద్యుత్ తీగకు చెయ్యి తగిలి అక్కడే విద్యుత్ ఘాతం తో కుప్ప కూలాడు. దీనితో కుటుంబ సభ్యులు ఇంకా ఇంటికీ రాలేదు అని వ్యవసాయ భూమి కి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబం సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు.