సంక్రాంతి పండుగ సందర్భంగా కెనడా దేశం నుండి వెలువడే అంతర్జాతీయ మాసపత్రిక గడుగ్గాయి నిర్వహించిన కవితల పోటీలో విజేతలుగా నిలిచిన సిరిపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం నాడు పత్రిక వారు పంపించిన సర్టిఫికెట్లను, నగదు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వివిధ దేశాల లోని తెలుగు విద్యార్థులు పోటీపడిన ఈ కవితల పోటీలలో సిర్పూర్ పాఠశాల విద్యార్థులకు ప్రథమ మరియు ప్రోత్సాహక బహుమతులు సాధించడం సంతోషమని, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిన్న పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానాన్ని అందించినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.ఈ పోటీలకు చక్కని శిక్షణ ఇచ్చిన తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్లను అభినందించారు.
ఈ పోటీలలో పదవ తరగతి విద్యార్థులు జే. రచన రెండు ప్రథమ బహుమతులను, టి. అక్షయ ప్రథమ బహుమతిని మరియు ప్రోత్సాహక బహుమతిని సాధించింది.అలాగే ప్రోత్సాహక బహుమతులను 9వ తరగతి విద్యార్థులు ఎం. మాధురి,ఎమ్. మేఘన అందుకున్నారు వీరితోపాటు ఏడవ తరగతి విద్యార్థులు ఎన్. చేత్ర, డి.సుశాంత్ ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు.
ఈ విద్యార్థులకు బహుమతుల కింద సర్టిఫికెట్లు మరియు నగదును కెనడా నుండి నిర్వాహకులు పంపించడం జరిగిందని తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్ల తెలియజేశారు.
విద్యార్థుల ఈ అభినందన కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల మోహన్ వందన గాయత్రి అక్బర్ బాషా, డాక్టర్ హజారే శ్రీనివాస్,లలిత మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
