అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆద్వర్యంలో ఎక్సైజ్,సివిల్ పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యువతమాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి తమ ఉజ్వత భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని..
డ్రగ్స్ సమస్యగా మారిందనీ పేర్కొన్నారు. పోలిసులు విస్తృతం గా తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలనీ సూచించారు.ఈ సమావేశంలో, రద్దీ ప్రాంతాల్లో మాత్రమే చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని వివిధ పాన్ షాపులు,కిరణ దుకాణంలో చిన్న చిన్న గంజాయి ప్యాకెట్ లు విక్రయిస్తున్నారని పలు మార్లు కేసులు నమోదయ్యాయి.
జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డు, దుబ్బ ప్రాంతంలో ఎక్కువగా గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనీ తెలిపారు ఇకపై గంజాయి పట్టుబడిన వ్యక్తులకు,వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేయాలని పేర్కొన్నారు.
ఇక కొన్ని మెడికల్ షాపు లలో గడువు దాటిన మాత్రలు,మందులు విక్రయిస్తున్నారని వాటిపై కూడా నిఘా అవసరమని ఆయన తెలిపారు.పక్క రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసమని చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్నాడని గత కొన్ని రోజులుగా నిత్యం ఏదో చోట దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.వారిపై నిఘా ఉంచి కట్టడి చేయాలని పోలీసులను ఆదేశించారు.ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నిజామాబాద్,ఆర్మూర్,బోధన్ ఏసిపి లు,ఎక్సైజ్ పోలిసులు సివిల్ పోలీసులు పాల్గొన్నారు
