విధుల్లో అలసత్వం …..విచ్చల వీడి అవినీతి లతో దారి తప్పిన అధికారుల కఠిన చర్యలతో వణుకు పుట్టించిన కమిషనర్ కింది స్థాయిలోనూ ప్రక్షాళన అనివార్యంగా భావించారట ఇందులో భాగంగానే కింది స్థాయిలోనూ మూకుమ్మడి బదిలీ చేశారు.కానీ మరికొంత మంది ముదుర్లు బదిలీ వేటు ఎలాగో తపించుకున్నారు
పోలీసు కమిషనరేట్ పరిధి కింది స్థాయిలో జరిగినబదిలీ లు కలకలం రేపాయి. మొన్నటి దాక అధికారుల స్థాయిలోనే కఠిన చర్యలు చేపట్టిన కొత్వాల్ ఈసారి కింది స్థాయిలోనూ అవినీతి అలసత్వ వైఖరు లమీద ఎట్టకేలకు కొరఢా ఝుళిపించారు.
ఇందులో భాగంగా 77 మంది కానిస్టేబుళ్లు 12 మంది జమేదార్లు 6 ఏ ఎస్సై లను బదిలీ చేసారు. నిజానికి కమిషనరేట్ పరిధి లో సాధారణ బదిలీ గత కొన్నేళ్లుగా జరగడం లేదు. వందలాది మంది కానిస్టేబుళ్లు బదిలీ లకోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో కమిషనర్ గుట్టు చప్పుడు కాకుండా 77 మంది కానిస్టేబుళ్ల ను బదిలీ చేయడం ఆ శాఖలో చర్చనీయాంశం అయింది. అందులోనూ అర్బన్ లో పనిచేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. అందులోనూ అవినీతి దందాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన టాస్క్ ఫోర్స్ విభాగం ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారు.
ఒక్కోరో ఏళ్లతరబడిగా ఆయా స్టేషన్ లలో పాతుకుపోయి పనిచేస్తున్నారు. కొందరు కానిస్టేబుళ్లు ఎంతో నిబద్దత తో పనిచేసే అధికారులనైనా సరే బుట్టలో వేసుకొని చెలరేగి పోతున్నారనే వాదన ఉంది.
ఆయా స్టేషన్ ల్లో ఇలాంటి ముదుర్ల ఎవరెవరున్నారనేది ఆయా విభాగాల నుంచి పక్కాగా సమాచారం తెప్పించుకున్నాకే బదిలీ వేటు వేసారనేది సమాచారం. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న వారి విషయంలోనే కమిషనర్ ఎక్కువగా ఫోకస్ పెట్టి నట్లు తెలిసింది.
కానీ నగరంలో ఇంకా అలాంటి ముదుర్లు ఆయా స్టేషన్ లలో ఇంకో అరడజన్ మంది ఉన్నారు వారిఫై బదిలీ వేటు పడలేదు. నిజానికి గత కొంత కాలంగా ఆయా ఆయా స్టేషన్ లలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు హవా సాగుతుండడం ఫై సీరియస్ గా ఉన్నారు.
వీరిని ఆయా స్టేషన్ ల్లో ఎవరు ప్రోత్సహిస్తున్నారనేది అరా తీస్తూ వస్తున్నారు. అదీగాక కీలక మైన సమాచారం క్షణాల్లో బయటికి వెళ్తుండడాన్ని కూడా ఆయన తీవ్రంగా పరిగణించారు.
అయినప్పటికి కిందిస్థాయిలో చర్యలు తీసుకునే విషయంలో చాల కాలం ఓపిక పడుతూ వచ్చారు. ఎలాగో ఎస్సై నుంచి ఏసీపీ దాక దారి తప్పిన అధికారుల విషయంలో కఠినంగా చర్యలు తీసుకుంటూ వస్తున్న కొత్వాల్ ఇక కింది స్థాయిలోనూ ప్రక్షాళన అనివార్యంగా బావించారనే ప్రచారం జరుగుతుంది.
ఎస్సై సీఐ లే కాదు ఏసీపీ ల బదిలీ ల్లోనూ రాజకీయ ప్రమేయం లేకుండా కట్టడి చేస్తూనే విధుల్లో అలసత్వంగా ఉండే అధికారుల విషయంలో కఠినంగా వుంటున్నారు. అన్ని స్థాయిలోనూ ప్రక్షళన కార్యాచరణ పూర్తీ అయినందున రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పోలీసింగ్ ఉంటుందనే ఆశాభావంతో కమిషనర్ ఉన్నారు!
