ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి..ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ…ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ను ధరించాలని ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ పేర్కొన్నారు.సోమవారం నగరంలోని ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ దరించడంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకపోవడంతో అనేకమంది ద్విచక్రవాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు హెల్మెట్ లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన తెలిపారు.
హేల్మెట్ రక్షణ కవచం లాంటిదని, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలని అన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు.
ఇప్పటివరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు తలపై హెల్మెట్ ఉన్నా లేకున్నా చూసి చూడనట్టుగా వ్యవహరించిన పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
అలాగే తనిఖీల సమయంలో హెల్మెట్ ధరించకుండా పట్టుబడిన ప్రతి వాహనదరుడికి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సంజీవ్ సిబ్బంది పాల్గొన్నారు.