నిజామాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది.అర గంట పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షం తో నగరం అతలాకుతులం అయింది.
అనేక ప్రాంతాలు నీట మునిగి పోయాయి. వందలాది ఇండ్లలోకి వరద నీరు వచ్చింది.
రైల్వే కామన్ వద్ద ఏడు అడుగుల మేరకు వరద నీరు వచ్చి చేరింది. దీనితో ఓ ఆర్టీసీ బస్సు ఇదే వరద నీటిలోకి వచ్చి మధ్యలోనే చిక్కుక పోయింది.
బస్సులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో అక్కడే ట్రఫిక్ విధుల్లో ఉన్న పోలీసులు స్థానికులు రంగంలోకి దిగి బస్సులో ఉన్నవారిని సురక్షితంగా బయటికి తెచ్చారు