తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులు పెరిగిపోవడం పట్ల నిరసనగా తెలంగాన రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ పిలుపుమేరకు సోమవారం రోజు
నిజామాబాద్ బార్ అసోసియేషన్ బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన సోమవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులు
కొందరు పోలీసుల దుశ్చర్యల మూలంగా పోలీసు వ్యవస్థ అపఖ్యాతి పాలవుతోందని తెలినట్లు బార్ అధ్యక్షుడు జగన్మోహన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కూకట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు సంతోష్ ను అకారణంగా తెల్లవారుజామున ఇంటినుండి తీసుకువెళ్లిన తీరు సభ్యసమాజానికి తలవంపులు తెచ్చిందని అన్నారు.
చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సి పోలీసులు చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడడం క్షమించరాని క్రిమినల్ చర్యలని పేర్కొన్నారు. బోరుబండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జమాల్ ను ఉద్యోగం నుండి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదులపై పోలీసు దాడులపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని జగన్ అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం త్వరితగతిన రూపొందించి అమలు చేయాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయసేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల దాడులపై స్పందించి సంబంధిత పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశం అనంతరం జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కోశాధికారి దీపక్,లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు మానిక్ రాజు,రవీందర్,భిక్షపతి, బిట్ల రవి,ఆశ నారాయణ, విశ్వక్ సేన్ రాజ్,భానుచందర్,గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు