నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ ఎస్ఐ గా విధులు నిర్వర్తించి ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా బోథ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అవుతున్న సందర్భంగా ఎస్ఐ ఎల్.ప్రవీణ్ కు టౌన్ సిబ్బంది సోమవారం పోలీస్ స్టేషన్ లో ఘనంగా వీడ్కోలు సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్ మాట్లాడుతూ.. తన విధి నిర్వహణలో తనకు సహకరించినటువంటి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మూడవ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.